పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

ద్విపదభాగవతం - మధురకాండ : శ్రీకృష్ణుఁడు ఉద్ధవుని మందకుఁ బుచ్చుట

నరార మన్నించి గఁ గౌఁగిలించి
కొని బుజ్జగించి మ్రొక్కుచు సిరిపలికె. 
“ఏపార వ్రేపల్లెకేఁగి యానంద
గోపయశోదలఁ గొమరారఁ గాంచి
క్కువ వారి సేములెల్ల నడిగి 
మ్రొక్కితినను, నేము మొగి తమ్ముఁ జూడ   - 330
చ్చెదమను, వేగ సుదేవు దొంటి
యిచ్చటి చుట్టాలు యేమును గలసి
యున్నారమను, మమ్మునుగ్రసేనుండు
న్నించునని చెప్పు, మందలోఁ గల్గు
గోపాలకులనెల్లఁ గోరి వేర్వేర
నేపార నక్కుననిడినంటి ననుము; 
నుఁ బాసి మదనబాములలో దారి
నమైన విరహాగ్నిఁ గ్రాఁగుచునున్న
ల్లవ సతుల నెవ్వగలెల్లఁ తీర్ప
నెట్లుటిలోననే నేతెంతుననుము
పొ”మ్మన్న నయ్యదు పుంగవుఁ డెలమి 
క్రమ్మర రథమెక్కి దలి మాపటికిఁ 
రమొప్ప రవికన్యకాతీరభూమి
బొరి గిన్నరేశునిపురి గ్రేణిసేసి
కలసంపదలకు దనమైపొలుచు
కలంకగతి మందరిగె నుద్ధవుఁడు
నరాక నెరిఁగింపఁ గ నందుఁ డెదురు